వెలుతురు పెరిగింది.. కానీ నీడ తగ్గింది... విక్రమ్‌కు ఏం జరిగిందో వెల్లడిస్తాం (video)

గురువారం, 17 అక్టోబరు 2019 (14:58 IST)
చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రాజెక్టుకి చెందిన విక్రమ్ ల్యాండర్‌ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఇందుకోసం అమెరికా పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టనుంది. 
 
ఆ సంస్థకు చెందిన లూనార్ రిక‌న‌యిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) చంద్రుడి ద‌క్షిణ ధ్రువానికి సంబంధించిన పలు చిత్రాల‌ను తీసింది. ప్రస్తుతం వీటిని ప‌రిశీలిస్తున్నామ‌ని, విక్రమ్‌ ల్యాండర్‌కు ఏం జరిగిందన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్ర‌వేత్త నోహా పెట్రో వెల్లడించారు. 
 
గత మూడు రోజుల క్రితం చంద్రుడి ఉప‌రిత‌లంపై వెలుతురు పెరిగింద‌ని, అయితే, గత నెల‌తో పోలిస్తే ద‌క్షిణ ధ్రువ ప్రాంతంలో నీడ త‌గ్గింద‌ని ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన కూడా ద‌క్షిణ ధ్రువం నుంచి ఎల్ఆర్‌వో వెళ్లిన విషయం తెలిసిందే. 
 
అయితే, అక్క‌డ వెలుతురులేని కార‌ణంగా విక్ర‌మ్ ఆచూకీ తెలియరాలేదు. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ను గత నెల 7వ తేదీ తెల్లవారుజామున ఇస్రో దక్షిణ ధ్రువంపై దించే కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయపుటంచుల వరకు చేరుకొని చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కారణంగా కమ్యూనికేషన్‌తో సంబంధాలు తెగిపోవడంతో ఈ ప్రాజెక్టు విజయవంతకాలేకపోయింది.
  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్