ఒక్క సినిమా కియారా అద్వానీ దశ మార్చింది... క్యూ కడుతున్న నిర్మాతలు

శనివారం, 3 ఆగస్టు 2019 (11:34 IST)
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి "కబీర్ సింగ్" పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో ఈమె నటనకు బాలీవుడ్ సినీ జనం ఫిదా అయిపోయింది. 
 
ఈ ఒక్క సినిమాతో కియారా అద్వానీ దశ తిరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కమిట్ అయిన పలు చిత్రాలతో రవ్వంత సమయం లేకపోయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఆమె సమయం కోసం వేసి చూస్తున్నారు. 
 
పైగా, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా స్టార్‌ హీరోయిన్లుగా పేరు పడిన వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడడంతో కియారాకు భలే గిరాకీ రావడానికి కూడా మరో కారణం. ఇదే అదునుగా భావించిన కియారా తన పారితోషికాన్ని డబుల్‌ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. 
 
బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు. మరి ఇంత డిమాండ్‌ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే ఛాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌లో జనాలు అంటున్నారు. 
 
కాగా, తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంలో కియారా నటించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినప్పటికీ అది ఆమెను నిరాశపరిచింది. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లలో ఆమె డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అందాలు ఆరబోసే మాస్ పాత్రలు చేయను : కన్నడ భామ