Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమలాపాల్ కరణ్ జోహార్ కంటపడింది.. ఇక పండగే పండగ (video)

Advertiesment
Lust Storie
, గురువారం, 10 అక్టోబరు 2019 (12:58 IST)
అమలాపాల్ ''ఆమె'' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమలాపాల్ ఈ సినిమాలో నగ్నంగా నటించింది. ఈ సినిమా తమిళంలో బాగానే హిట్ అయ్యింది. తెలుగులో మాత్రం కొన్ని విమర్శలకు తావిచ్చింది. అయినప్పటికీ అమలాపాల్ చేసిన సాహసానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఆమె సినిమా కోసం అరగంట పాటు ఒంటిమీద నూలుపోగు లేకుండా నటించిన అమలాపాల్ సాహసాన్ని మెచ్చుకున్నారు. 
 
ఫలితంగా ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయలేనంతగా ఆమె చేసింది. ఇకపోతే ఆమె సినిమా చాలా బాగుందని సినీ తారల్లో సమంతతో పాటుగా బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా అమలపై ప్రశంసల వర్షం కురిపించారు. చాల బోల్డ్‌గా ఉన్నా కూడా బ్యూటిఫుల్‌గా ఉందని కరణ్ జోహార్ కితాబిచ్చాడు.
 
ఇకపోతే కరణ్ జోహార్ తాజాగా హిందీలో బాగా పాపులర్ అయిన కొన్ని వెబ్ సిరీస్‌లను తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందుకోసం ఆమె హీరోయిన్ అమలాపాల్‌ను ఎంచుకునేందుకు కరణ్ జోహార్ ప్రయత్నాలు మొదలెట్టారు. మరోవైపు లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్‌లో అమలా పాల్‌ను తీసుకోవాలని ఆ సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విపరీతంగా విస్కీ తాగడం వల్ల ఆరోగ్యం పాడైంది : శృతిహాసన్