Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లినా ఖుషి పాటల గురించి మాట్లాడుతున్నారు : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (17:05 IST)
Music director Hesham Abdul Wahab
‘ఖుషి’ మ్యూజిక్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఓ నాలుగు రోజులు విరామం తీసుకుంటాను. ఆ తర్వాత నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తా. ప్రస్తుతం ఈ సినిమా పాటల పనులు జరుగుతున్నాయి. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కీరవాణి, మిక్కీ జే మేయర్, భీమ్స్ మ్యూజిక్ ఇష్టం- అని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అన్నారు. 
 
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ  దర్శకత్వం వహించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ‘ఖుషి’ సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.
 
నా మలయాళ హిట్ ఫిల్మ్ హృదయం రిలీజైన తర్వాత మైత్రీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఖుషి’ సినిమాకు వర్క్ చేయమని అడిగారు. శివ గారు చెప్పిన కథ విన్నాక ఒక బ్యుటిఫుల్ మూవీకి వర్క్ చేయబోతున్నా అని అర్థమైంది. వెంటనే ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను. ‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నిన్న మొత్తం మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసేవరకు ఎగ్జైటింగ్ గా మా జర్నీ సాగింది. మేము సినిమాకు పెట్టిన ఎఫర్ట్స్ రేపు థియేటర్ లో ప్రేక్షకులు చూస్తారు.
 
‘ఖుషి’ సినిమా కోసం వీణ, సితార్ వంటి ఇస్ట్రుమెంట్స్ వాడాం. నా రోజా నువ్వే పాట నుంచి రీసెంట్ గా రిలీజ్  చేసిన ఓసి పెళ్లామా వరకు అన్ని పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాకు కంప్లీట్ మ్యూజిక్ చేయగలిగాం. మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మ్యూజిక్ ఉండాలని అనుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాలో కష్టపడి కంపోజ్ చేసిన పాట టైటిల్ సాంగ్. ఖుషి టైటిల్ సాంగ్ మొదట సినిమాలో లేదు. టీజర్ కోసం ట్యూన్ చేశాను. అయితే ఆ ట్యూన్ అందరికీ నచ్చింది. దీన్ని సాంగ్ చేయాలని అడిగారు. అలా ఖుషి టైటిల్ సాంగ్ చేశాను. ఈపాటకు 20, 25 డెమోస్ చేశాం. విదేశాలకు వెళ్లినా కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు. అదే మాకు పెద్ద అఛీవ్ మెంట్.
 
- నా రోజా నువ్వే పాటలో డైరెక్టర్  మణిరత్నం సినిమా టైటిల్స్ తో లిరిక్స్ ఉంటాయి. పాట ఇలా ఉండాలని డైరెక్టర్ శివ ప్లాన్ చేశారు. ఆయనే లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో విజయ్ మణిరత్నం, ఏఆర్ రెహమాన్ ఫ్యాన్. ఆయన లవ్  గురించి తన ఫేవరేట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలను గుర్తు చేస్తూ పాట పాడతారు. ఈ థీమ్ బాగా వర్కవుట్ అయ్యింది. ‘ఖుషి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
 
శివ మ్యూజిక్ గురించి ప్యాషన్ దర్శకుడు. అతనికి ఏం కావాలో తెలిసిన దర్శకుడు. మేము ఒక హోటల్ లో నెల రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాం. నేను ఎక్కువ రోజులు ఒక సినిమాకు పనిచేసింది కూడా ‘ఖుషి’కే. హీరో విజయ్ కు తన సినిమాల నుంచి ఆడియన్స్ ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటారో తెలుసు. అందుకే తన సజెషన్స్ నాకు చెప్పేవాడు. అవి చాలా హెల్ప్ అయ్యాయి. ఒక టీమ్ మెంబర్ గా మ్యూజిక్ లో తన ఇన్వాల్వ్ మెంట్ ఉండటం మంచిదే.
 
మ్యూజిక్  బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కు రప్పించవచ్చు అని నేను బిలీవ్ చేస్తాను. ‘ఖుషి’లో సమంత, విజయ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వాళ్లు పోటా పోటీగా నటించారు. ఈ సినిమాకు వాళ్ల పెయిర్ పెద్ద అసెట్ అవుతుంది.
 
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి. నన్ను టాలీవుడ్ ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి మ్యూజిక్ కోసం తాపత్రయపడే ఇండస్ట్రీ ఇది. సంగీత దర్శకుడిగా ఇలాంటి మూవీస్ చేయాలనే హద్దులేం లేవు. అన్ని జానర్స్ మూవీస్ కు మ్యూజిక్ చేయాలని అనుకుంటున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments