Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ కోసం స్పోర్ట్స్‌ బైక్‌పై `ఖిలాడి`

Webdunia
శనివారం, 24 జులై 2021 (18:19 IST)
Khiladi byte
‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరవాత హీరో రవితేజ, సెన్సేష‌న‌ల్ హిట్‌ ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లేస్మార్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. మీనాక్షీ చౌదరి, డింపుల్ హ‌యాతి నాయిక‌లు. పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ గడ సమర్పణలో సినిమాను ఎ స్టూడియోస్, హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రా భినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్లడిస్తూ చిత్రయూనిట్‌ ‘ఖిలాడి’ సినిమాలోని రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్లో స్పోర్ట్స్‌ బైక్‌పై అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదిరి పోయేలా కనిపిస్తున్నారు హీరో రవితేజ. అలాగే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముందే ఇటలీలో ఓ భారీ షెడ్యూల్‌ను ‘ఖిలాడి’ చిత్రయూనిట్‌ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘ఖిలాడి’ సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌కు అదిరిపోయే థ్రిలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు దర్శకుడు రమేశ్‌ వర్మ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ దానికోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టి వ‌ర్క్ చేస్తున్నారు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు ఛాయాగ్రాహకులు. శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌ (ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు) ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అమర్‌ రెడ్డి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments