Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నంబర్ 150' టిక్కెట్ ధరతో పోటీపడలేని 'గౌతమిపుత్ర శాతకర్ణి' టిక్కెట్...

సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు చెందిన టిక్కెట్ ధరలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతున్నాయి. బుధవారం విడుదలైన ఖైదీ చిత్ర టిక్కెట్లు రూ.లక్షల్లో అమ్ముడు పోయిన విష

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (09:04 IST)
సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు చెందిన టిక్కెట్ ధరలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతున్నాయి. బుధవారం విడుదలైన ఖైదీ చిత్ర టిక్కెట్లు రూ.లక్షల్లో అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి చెందిన మూడు టిక్కెట్లు ఏకంగా రూ.36 లక్షలకు అమ్ముడుపోయాయి. 
 
కానీ, నందమూరి బాలయ్య 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురువారం అభిమానుల ముందుకు వచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ఈ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతేకాక ఈ థియేటర్‌కి బాలయ్య కూడా రానున్నడంతో అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది. 
 
బాలయ్యతో కలిసి సినిమా చూసేందుకు గోపీచంద్‌ అనే అభిమాని టికెట్ కోసం ఏకంగా రూ.1,00,100 పెట్టి కొన్నాడు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చేందుకు రూ.1,00,100 పెట్టి టికెట్‌ కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ థియేటర్‌లోనే బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, రాజమౌళి, కొరటాల శివ ముందస్తు చిత్రాన్ని వీక్షించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments