Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ ఛాప్టర్ 2- జ‌న‌వ‌రి 8న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:45 IST)
కన్నడ హీరో య‌ష్ న‌టించిన కేజీఎఫ్ బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి క‌న్న‌డ చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది. 
 
తొలి భాగం ఊహించ‌ని స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో రెండ‌వ భాగంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రెండ‌వ భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
 
ఇందులో కీల‌క విల‌న్ అధీరాగా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజ‌య్‌ద‌త్  క‌నిపించ‌బోతున్నారు. ''రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్'' పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ఆర్‌ఎఫ్‌సీలో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
 
జ‌న‌వ‌రి 8న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్ర‌త్యేకంగా టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ రోజు హీరో య‌ష్ పుట్టిన రోజు కావ‌డ‌మేనని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ?

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments