సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేజీఎఫ్-2 :: "బాహుబలి" రికార్డు బ్రేక్ (video)

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (11:07 IST)
కన్నడ సెన్సేషనల్ స్టార్ యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, రామికా సేన్ వంటి అగ్ర నటీనటులు నటించిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ -2. ఈ చిత్రం టీజర్ ఈ నెల 8వ తేదీన విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
గతంలో వచ్చిన 'కేజీఎఫ్' చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న "కేజీఎఫ్-చాప్టర్ 2" విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైన 10 గంటల వ్యవధిలోనే రాజమౌళి "ఆర్ఆర్ఆర్", విజయ్ హీరోగా రానున్న "మాస్టర్" చిత్రాలను దాటేసింది.
 
యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన తర్వాత 10 గంటలా 30 నిమిషాల వ్యవధిలో "కేజీఎఫ్ - చాప్టర్ 2" 20 లక్షల వ్యూస్‌ను తెచ్చుకుంది. 
 
ఇదేసమయంలో తొలి 10.30 గంటల వ్యవధిలో 'మాస్టర్' 18.5 లక్షలు, 'సర్కార్' 11.8 లక్షలు, 'ఆర్ఆర్ఆర్' (రామరాజు ఫర్ బీమ్) 9.41 లక్షలు, 'మెర్సెల్' 7.82 లక్షల వ్యూస్‌ను తెచ్చుకున్నాయి. ఇక 7వ తేదీన టీజర్ విడుదల కాగా, ఇంతవరకూ 11 కోట్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments