Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ బయోపిక్ ''శశిలలిత"గా తీస్తా: కేతిరెడ్డి

త‌మిళ‌నాడు దివంగత ముఖ్యమంత్రి, దివంగ‌త‌ జయలలిత, ఆమె స‌న్నిహితురాలు శశికళపై ''శశిలలిత'' పేరుతో సినిమా తీస్తానని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాహుబలిలా రెండు పార్టులుగా తీస్తానని చెప్పారు. మొ

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (17:34 IST)
తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలు చాటిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రెండు చిత్రాలు తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. మూడోదిగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అయితే ఈ సినిమా తీస్తే చంపేస్తానని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి బెదిరిస్తున్నట్లు కేతిరెడ్డి ఇటీవల విమర్శలు గుప్పించారు. తాజాగా కేతిరెడ్డి మరో బయోపిక్ తీసే పనులో పడ్డారని తెలిసింది. 
 
త‌మిళ‌నాడు దివంగత ముఖ్యమంత్రి, దివంగ‌త‌ జయలలిత, ఆమె స‌న్నిహితురాలు శశికళపై ''శశిలలిత'' పేరుతో సినిమా తీస్తానని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాహుబలిలా రెండు పార్టులుగా తీస్తానని చెప్పారు. మొదటి భాగంలో జయలలిత, శశికళ పాత్రల గురించిన కథను చూపిస్తానని.. రెండో భాగంలో ఆస్పత్రిలో చేరిన జయలలిత కథను చూపిస్తానని తెలిపారు. ఇంకేముంది..? ఇప్పటికే లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాపై వివాదం నెలకొన్న తరుణంలో మరోవైపు అమ్మ జీవిత చరిత్రపై సినిమా తీస్తాన‌ని కేతిరెడ్డి ప్ర‌క‌టించి వివాదానికి తెరలేపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments