Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశి గ్యాంగ్ వల్లే అమ్మ నివాసంలో ఐటీ సోదాలు : మంత్రి జయకుమార్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంలో నివాసం ఉంటున్నారనీ, అందువల్లే ఆ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీ చేయాల్సిన

శశి గ్యాంగ్ వల్లే అమ్మ నివాసంలో ఐటీ సోదాలు : మంత్రి జయకుమార్
, సోమవారం, 20 నవంబరు 2017 (08:29 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంలో నివాసం ఉంటున్నారనీ, అందువల్లే ఆ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమిళనాడు రాష్ట్ర మంత్రి డి.జయకుమార్ అభిప్రాయపడ్డారు. 
 
శుక్రవారం రాత్రి నాలుగు గంటల పాటు ఐటీ అధికారులు వేదనిలయంలో తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. ఈ తనిఖీలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పందించారు. తమను రాజకీయాలకు దూరం చేసేందుకే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటిపై ఆదాయం పన్ను దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 
 
జయ నివాసంపై దాడి చేసిన ఐటీ సిబ్బంది.. భవనంలోని కార్యాలయం విభాగాన్ని, శశికళ ఉపయోగించిన గదిని సోదా చేసినట్టు తెలిసింది. వేదనిలయం ఒకటిన్నర కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు పునీత స్థలం అని చెప్పారు. ఆ స్థలంలోకి ఐటీ అధికారులు వెళ్లడం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. 
 
జయ మరణం తర్వాత, శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులే అక్కడ నివాసం ఉంటున్నారని, ఐటీ దాడులకు వారే కారణమని మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ కూడా ఆరోపించారు. దాడుల సందర్భంగా ఐటీ సిబ్బంది దీప మేనకోడలు దీపను, ఇతర పార్టీ కార్యకర్తలను లోపలికి అనుమతించని విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్