అందుకే సావిత్రిగా మళ్లీ వద్దనుకున్నా.. ఇకపై బయోపిక్‌లొద్దు- కీర్తి సురేష్

దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:23 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ అలాంటి పాత్రే మళ్లీ కీర్తి సురేష్‌ను వరించింది. కానీ ఆ ఛాన్స్‌కు కీర్తి నో చెప్పింది. దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌కి ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్‌ని కీర్తి సురేష్ అంగీకరించలేదు. ఈ ఛాన్స్ వద్దనుకున్న కారణాన్ని కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహానటి అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మళ్లీ తాను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.. అందుకే ఆ ఛాన్స్ వద్దనుకున్నానని తెలిపింది. 
 
సావిత్రి మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానంటూ చెప్పుకొచ్చింది. కీర్తి సావిత్రిగా వద్దనుకున్న పాత్రలో నిత్యామీనన్ కనిపించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలు నడిరోడ్డుపై మాజీ ప్రియురాలిని పొడిచి చంపేసిన వ్యక్తి.. ఆపై గొంతుకోసుకుని?

నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగానికి ఇరువైపులా నాగుపాములు (video)

వామ్మో మొంథా తుఫాన్, ఏపీలోనే తీరం దాటుతుందట, రెడ్ ఎలర్ట్

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

ఎయిర్ పోర్టుకు క్యాబ్‌లో వెళ్లిన స్టూడెంట్.. టోల్ రూట్ దాటవేశాడు.. ఆరు ఆపమన్నందుకు దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments