Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథల ఎంపికలో తెలివిగా ఉన్నానంటున్న 'మహానటి'

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:18 IST)
Keerthy Sureshసీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో నటించడం వల్ల కీర్తి సురేష్‌కు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఒక్కసారిగా స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 
 
ఈ చిత్రం ఒక్క తెలుగులోనేకాకుండా తమిళంలో కూడా కీర్తి సురేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా 'మహానటి' చిత్ర ప్రస్తావనరాకుండా ఉండదు. ఆ చిత్రం తర్వాత కొన్ని కమర్శియల్‌ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే సాగిపోతోంది. 
 
ఈ క్రమంలో 'మహానటి' చిత్రం తర్వాత కీర్తి ఇప్పటివరకు కేవలం ఒక్కో చిత్రంలోనే నటించింది. ఇక తమిళంలో 'సర్కార్‌' చిత్రం తర్వాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్‌ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. 
 
ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటివారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది.
 
'మహానటి' చిత్రం తర్వాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యమని ఆమె చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments