ఆఫర్ల కోసం వెంపర్లాడుతున్న కియారా

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (16:59 IST)
కియారా అద్వానీ అంటే గుర్తొచ్చేది "భరత్ అనే నేను" సినిమా. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వచ్చిన ఈ భామ మొదటి చిత్రంలోనే సూపర్‌స్టార్ మహేశ్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కియారా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. దీంతో అదే నిర్మాణ సంస్థలో మరో చిత్రం చేయడానికి అవకాశం కొట్టేసింది. అయితే ఈ సారి అంచనాలు తలకిందులయ్యాయి. 
 
బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ సరసన "వినయ విధేయ రామ" చిత్రంలో జతకట్టినప్పటికీ, చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోయే సరికి కాస్త నిరాశలో పడింది. మరోపక్క బాలీవుడ్‌లో 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌గా వస్తున్న "కబీర్ సింగ్" చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. 
 
తెలుగులో ఆఫర్లు లేక బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతోంది. 'కబీర్ సింగ్' చిత్రం మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందని బోలెడన్ని ఆశలతో ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఆఫర్లు కరువై అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా ఆమె తెలుగులో నటించడం అనేది మూన్నాళ్ల ముచ్చటగా ముగుస్తుందో లేదో సమయమే నిర్ణయించాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వెంకీ నమ్మకాన్ని నిలబెట్టిన ఎఫ్2.. అంతేగా...