'మహానటి'లో సావిత్రి కష్టాల జీవితాన్ని చూపించరట... ఎందుకంటే...

ప్రముఖ దర్శకుడు సి.అశ్వినీదత్ సొంత సంస్థ వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్న చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తు

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (11:16 IST)
ప్రముఖ దర్శకుడు సి.అశ్వినీదత్ సొంత సంస్థ వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్న చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల న‌టి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌తో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్ బాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 9వ తేదీన విడుద‌లకానుంది. 
 
అయితే, ఈ చిత్ర కథకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సినిమాలో సావిత్రి చివరి రోజులు కూడా చూపించరన్నది తాజా సమాచారం. చివ‌రి రోజుల‌లో సావిత్రి త‌న ఆస్థుల‌ని కోల్పోయి, మ‌ద్యానికి బాగా అల‌వాటై త‌న జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంది. త‌న పేరిట ఉన్న చాలా ఆస్థులు సీజ్ చేశారు. 
 
కానీ వీట‌న్నింటిని మేక‌ర్స్ సినిమాలో చూపించ‌ద‌ల‌చుకోలేదట‌. సావిత్రి కుటుంబ స‌భ్యులు ఆమె ట్రాజిడీ స్టోరీ చూపించొద్దని ప్రాధేయపడటంతో వారు కూడా అందుకు ఓకే అన్నార‌ట‌. కాక‌పోతే చివ‌రి రోజుల‌లో సావిత్రి చాలా బాధ‌ల‌కి గురైంద‌ని మాత్రం కార్డ్ ద్వారా చెప్తార‌ని తెలుస్తుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments