Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ టాస్క్.. గీతా బాత్రూమ్‌కి వెళ్తున్నప్పుడు సాంగ్ ప్లే చేస్తే ఎలా..?

బిగ్‌బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ కూడా ‘టాలీవుడ్ మారథాన్’ టాస్క్ కొనసాగింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌‌కి మంగళవారం ఇచ్చిన ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ బుధవారం కూడా అదేలా పేలవంగా జరిగింది. కంటెస్టెంట్స్‌ తమకి కేట

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (10:27 IST)
బిగ్‌బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ కూడా ‘టాలీవుడ్ మారథాన్’ టాస్క్ కొనసాగింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌‌కి మంగళవారం ఇచ్చిన ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ బుధవారం కూడా అదేలా పేలవంగా జరిగింది. కంటెస్టెంట్స్‌ తమకి కేటాయించిన సాంగ్‌ని గుర్తుపెట్టుకుని... అది ప్లే అయినప్పుడు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్లోర్‌పైకి వచ్చి డ్యాన్స్ చేయాలి. ఒకవేళ మరిచిపోయినా లేదా ఏదైనా పనిలో ఉండి చేయలేకపోయినా బడ్జెట్‌లో కోత ఉంటుందని బిగ్‌బాస్ హెచ్చరించాడు. 
 
మంగళవారం మొదట్లో హౌస్‌మేట్స్ హుషారుగా డ్యాన్సులు చేసినప్పటికీ తర్వాత్తర్వాత సాంగ్స్‌ రిపీట్‌గా ప్లే అవ్వడంతో అలసిపోయారు. బిగ్ బాస్ ఇంకాస్త ముందుకెళ్లి అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు కూడా ప్లే చేయడంతో కాస్త ఇబ్బందిపడ్డారు. ఒకసారైతే గీతా బాత్రూమ్‌కి వెళ్తున్నప్పుడు తన సాంగ్ ప్లే అయ్యింది, వెంటనే ఆమె వెనక్కి వచ్చి ఫ్లోర్ ఎక్కగానే ఆగిపోయింది, తిరిగి వెళ్తుండగా మళ్లీ ప్లే అవ్వడంతో విసిగిపోయిన ఆమె వెలుపలికి రాలేదు. దీంతో కొన్ని పాయింట్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది.
 
వీటితో పాటు మధ్యలో మరో రెండు టాస్క్‌లను కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. అందులో ఒకటి కేక్‌ తినడం, రెండోది బొమ్లు వేయడం. బిగ్‌బాస్ బర్త్‌ డే సందర్భంగా నాలుగైదు పెద్ద కేక్‌లను పంపి తినమని చెప్పారు, ఇవి మొత్తం తినలేక కంటెస్టెంట్స్ కష్టపడ్డారు. ఇక బొమ్మల టాస్క్ వీరికి కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. బుధవారం మొత్తం కూడా ఈ విసుగెత్తించే డ్యాన్సులతోనే కానిచ్చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments