Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వేలల్లో కాటమరాయుడు పైరసీ సీడీలు

కొత్త సినిమాలు వస్తే చాలు చాలామంది పైరసీ చేస్తూ లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు అక్రమార్కులు. గత కొన్నిరోజుల ముందు రిలీజైన కాటమరాయుడు సినిమా పైరసీ డీవిడీలు తిరుపతిలోని కొన్ని సిడీ షాపులలో విరివిగా దొరుకుతున్నాయి. కేవలం 30 రూపాయలకే డివిడిని అమ్మేస్త

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (15:00 IST)
కొత్త సినిమాలు వస్తే చాలు చాలామంది పైరసీ చేస్తూ లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు అక్రమార్కులు. గత కొన్నిరోజుల ముందు రిలీజైన కాటమరాయుడు సినిమా పైరసీ డీవిడీలు తిరుపతిలోని కొన్ని సిడీ షాపులలో విరివిగా దొరుకుతున్నాయి. కేవలం 30 రూపాయలకే డివిడిని అమ్మేస్తున్నారు డివిడి షాపు యజమానులు. థియేటర్లలో వచ్చే ప్రింట్ లాగా స్పష్టంగా ఫైరసీ డివిడిలు కనిపిస్తున్నాయి.
 
కాటమరాయుడు సినిమాను థియేటర్లలో చూసే వారికన్నా పైరసీ డివిడిల్లో చూసే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఫైరసీ డివిడిలు అమ్ముతున్నారన్న విషయం పోలీసులకు తెలుసని విమర్శలున్నాయి. అయితే వారు డివిడి షాపుల యజమానుల నుంచి మామూళ్ళు వసూలు చేసుకొని తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే పవన్ అభిమాన సంఘం నేతలు కొన్ని డివిడి షాపులపై దాడులకు కూడా చేశారు. అయితే ఈ విషయాన్ని డివిడి షాపు యజమానులు బయటకు రానివ్వకుండా సైలెంట్ గానే ఈ వ్యవహారాన్ని నడిపేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే అతి తక్కువ ఖర్చుకే పైరసీ డివిడిలు దొరుకతుండడంతో సినీ నిర్మాతలకు తీవ్ర నష్టం కలుగుతోందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments