Webdunia - Bharat's app for daily news and videos

Install App

6500 థియేటర్లలో బాహుబలి 2: దానికోసం పోటీపడుతున్న అనుష్క, ప్రభాస్..

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదల కానుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాక్సాఫీసు రిక

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (14:50 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదల కానుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాక్సాఫీసు రికార్డు సృష్టించనుంది.

రానా దగ్గుబాటి, ప్రభాస్, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమా తొలి భాగమైన బాహుబలి రూ.600 కోట్లు సంపాదించింది. తద్వారా ప్రపంచ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డును బాహుబలి2 తిరగరాయనుందని టాక్ వస్తోంది. బాహుబలి2 సినిమా కోసం రూ.450 బడ్జెట్ కింద ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని బాహుబలి2 విడుదలైన వారం రోజుల్లోనే సంపాదించేస్తాడని సమాచారం.
 
ఈ నేపథ్యంలో బాహుబలి తారాగణం సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది. పనిలో పనిగా తమ తదుపరి సినిమాలను కూడా ప్రమోట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాహుబలి 2 సినిమా విడుదలను క్యాష్ చేసుకునేందుకు.. ప్రభాస్, అనుష్క రెడీ అవుతున్నారు. ప్రభాస్ నాలుగేళ్ళ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ని రూపొందించాడు. 
 
ఈ సినిమాకి సంబంధించి ముందుగా ఓ టీజర్‌ని రూపొందించి బాహుబలి2తో పాటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక బాహుబలిలో దేవసేనగా నటించిన అనుష్క భాగమతి అనే క్రేజీ ప్రాజెక్ట్‌ని ఇటీవలే పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్ర ట్రైలర్‌ని కూడా బాహుబలి ది కంక్లూజన్ మూవీతో పాటుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తద్వారా బాహుబలి క్రేజ్‌ను.. తదుపరి సినిమాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రభాస్, అనుష్క పోటీపడుతున్నారు. ఇప్పటికే పాటలు విడుదలైనాయి. ఈ పాటలకు నెట్టింట్లో భారీ క్రేజ్ లభిస్తోంది. 

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments