Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్. ఐ.ఎ ఆఫీసర్ గా కార్తికేయ

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:30 IST)
Kartikeya NIA officer
కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆదిరెడ్డి. టి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై  88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇందులో కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 
        దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ-‘’ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కార్తికేయ ఎన్. ఐ. ఎ. ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘కరుప్పన్’ లో నటించి, ప్రస్తుతం అదర్వ మురళితో చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు ఆమె. మంచి క్లాసికల్ డాన్సర్. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ’మెంటల్ మధిలో’, ’దొరసాని’,’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్. ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు.  
 
నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ-‘’ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. సూపర్ స్క్రిప్ట్ ఇది. కార్తికేయ పాత్ర చిత్రణ చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ సగం సినిమా పూర్తైయింది. ఈనెలాఖరు వరకు హైదరాబాదులో జరిపే షెడ్యూల్ తో 90 శాతం పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లి లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. 
ఇంకా సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments