Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంఛనంగా ప్రారంభమైన కార్తీక్ రాజు సినిమా హస్తినాపురం

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (16:33 IST)
Nisha, kartiraju.. clapby bheminenni
హీరో కార్తీక్ రాజు అథర్వ రిలీజ్‌కు సిద్దంగా ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. అథర్వ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. కాసు క్రియేషన్స్ బ్యానర్ మీద కాసు రమేష్ నిర్మిస్తున్న ‘హస్తినాపురం’ అనే చిత్రంలో కార్తీక్ రాజు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా గండ్రోతు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
 
ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ మూవీని ప్రారంభించారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా..  ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అందజేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో దర్శక నిర్మాతలు హీరో మాట్లాడారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు.
 
 నిర్మాత కాసు రమేష్ మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు వద్ద మేకప్ మెన్, మేనేజర్‌గా ఉండేవాడ్ని. ఆయన నన్ను నిర్మాతను చేశారు. మా డైరెక్టర్ రాజా వివి వినాయక్ వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. కథలో దమ్ముంది కాబట్టే నిర్మిస్తున్నాం. మా చిత్రాన్ని ఆదిరించండి’ అని అన్నారు.
 
 దర్శకుడు భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు, నిషా హీరో హీరోయిన్లు. రాజా అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వి వి వినాయక్ వద్ద రాజా అసిస్టెంట్‌గా పని చేశారు. మా కౌసల్యా కృష్ణమూర్తితో కార్తీక్ రాజుకు మంచి పేరు వచ్చింది. అథర్వ కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను. ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. ‘కౌసల్యా కృష్ణమూర్తి చూసి కార్తీక్ రాజుతో ఓ లవ్ స్టోరీని చేశాను. అది నెక్ట్స్ వాలెంటైన్స్ డేకి రాబోతోంది. అథర్వతో కార్తీక్ రాజు ఇమేజ్ మారబోతోంది. ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘హస్తినాపురం కొత్త పాయింట్‌తో రాబోతోంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. మా డైరెక్టర్ అద్భుతంగా కథ రాసుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఆల్రెడీ హనుమాన్ సాంగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారు. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ‘రాజా గారు ఓ మంచి కథతో రాబోతున్నారు. కార్తీక్ రాజుతో నాకు ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
 
 రాజా గండ్రోతు మాట్లాడుతూ.. ‘హస్తినాపురం అనే టైటిల్ వినగానే ఎంత పాజిటివిటీ ఉందో.. సినిమా కూడా అంతే ఉంటుంది. నా గురువు వినాయక్ గారి దగ్గర పని చేశాను. మంచి కథ, మంచి టీంతో రాబోతున్నాం. మా అందరినీ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను.  నా మీద నమ్మకంతో నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన మా రాజు గారికి, మా హీరో కార్తీక్ గారికి థాంక్స్ నిర్మాత రమేష్ గారికి థాంక్స్’ అని అన్నారు.
 
 హీరోయిన్ నిషా మాట్లాడుతూ.. ‘తెలుగులో మళ్లీ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ మూవీలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments