Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు మురుగన్ సినిమా జపాన్ డబ్బింగ్ ను జపాన్ గెటప్ తో ప్రారంభించిన హీరో కార్తి

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (12:02 IST)
Kaarti dubbing
హీరో కార్తీ ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'జపాన్' చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇదివరకే కార్తీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా వున్నాయి. కార్తి డబ్బింగ్ చెబుతుంటారు. కానీ టేక్ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్ తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో, ముఖ్యంగా జపాన్ పెక్యులర్ వాయిస్, లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది. యూనిక్ కాన్సెప్ట్ తో ఈ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు.  
   
కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు.
 
జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
 
దీపావళికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments