Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి, ఎవరెవర్నో పెడుతున్నారు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (15:35 IST)
ఖైదీ లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ తెలుగులో అందిస్తున్నారు. 
 
ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌ 10న చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ”చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే” అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలౌతుంది. 
 
‘ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథకి తగ్గ యాక్షన్‌ కూడా ఉందని తెలుస్తోంది.

ఇక ట్రైలర్‌ చివర్లో.. ”ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క..” అంటూ కార్తీ చెప్పే డైలాగ్‌లో ఆయన ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌ అనే చెప్పాలి. ట్రైల‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. మ‌రి.. సినిమాకి కూడా అదే స్ధాయిలో ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments