Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటితీర్థాల పుణ్య‌ఫ‌లం... అరుణాచ‌లేశ్వ‌రుని ద‌ర్శ‌నం...!

Advertiesment
కోటితీర్థాల పుణ్య‌ఫ‌లం... అరుణాచ‌లేశ్వ‌రుని ద‌ర్శ‌నం...!
, శుక్రవారం, 29 నవంబరు 2019 (15:53 IST)
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచ‌లం పంచ‌భూత‌లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భార‌తంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. 
 
ఇక్క‌డ అరుణాచ‌ల కార్తీక దీపోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని కృతికా న‌క్ష‌త్రం పౌర్ణ‌మినాడు అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తారు. సుమారుగా న‌వంబ‌రు 15 నుంచి డిసెంబ‌రు 15వ తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం త‌మిళ క్యాలెండ‌రు ప్ర‌కారం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 28న (గురువారం) రాత్రి దుర్గాదేవి ఆల‌యం తిరువ‌ణ్నామ‌లైలో అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. శుక్ర‌వారం సాయంత్రం 7 గంట‌ల‌కు అరుణాచ‌లేశ్వ‌ర ఆల‌యంలో పిడారి అమ్మ ఉత్స‌వం ప్రారంభం అవుతుంది. శ‌నివారం సాయంత్రం 7 గంట‌ల‌కు వినాయ‌కుడి ఉత్స‌వం జ‌రుగుతుంది. 
 
* డిసెంబ‌రు 1న ఆదివారం ఉద‌యం 5:30 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు అరుణాచ‌లేశ్వ‌ర ఆల‌యంలో ధ్వజారోహ‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది. అనంత‌రం పంచ‌మూర్తుల ఊరేగింపు జ‌రుగుతుంది. అదే రోజు రాత్రి అధికార నంది వాహ‌నంపై సోమ‌స్కంద‌మూర్తి మాఢ వీధుల‌లో ఊరేగింపు ప్రారంభం. 
 
* డిసెంబ‌రు 2న ఉద‌యం సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు జ‌రుగుతుంది. అదే రోజు రాత్రి ఇంద్ర విమాన వాహ‌నంపై సోమ‌స్కందమూర్తి మాఢ వీధుల్లో ఊరేగుతారు. 
 
* డిసెంబ‌రు 3న భూత వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు సాగుతుంది. అదేరోజు రాత్రి సింహ‌వాహ‌నంపై సోమ‌స్కంద‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు ఉంటుంది. 
 
* డిసెంబ‌రు 4న ఉద‌యం స‌ర్ప వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు, అదేరోజు రాత్రి క‌ల్ప‌వృక్షం, కామ‌ధేను వాహ‌నాల‌పై సోమ‌స్కంద‌మూర్తి ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. 
 
 
* డిసెంబ‌రు 5న ఉద‌యం వృష‌భ వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి ఊరేగింపు. అదేరోజు రాత్రి వెండి, వృష‌భ వాహ‌నాల‌పై సోమ‌స్కంద‌మూర్తి మాఢ వీధుల‌లో ఊరేగింపు కార్య‌క్ర‌మం.
 
* డిసెంబ‌రు 6 ఉద‌యం అరువ‌ది ముగ్గురు(63) నాయ‌నార్లు ప‌ల్ల‌కీలో మాఢ‌వీధుల‌లో ఊరేగింపు. వెండి గ‌జ‌వాహ‌నంపై చంద్ర‌శేఖర‌మూర్తి మాఢ వీధుల‌లో ఊరేగింపు. అదేరోజు రాత్రి వెండి రథంపై సోమ‌స్కంద‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు.
webdunia
 
 
* డిసెంబ‌రు 7న ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు పంచ‌మూర్తులు పంచ మ‌హార‌ధాల‌పై మాఢ‌వీధుల‌లో ఊరేగింపు. 
 
* డిసెంబ‌రు 8న ఉద‌యం అశ్వ‌వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు. సాయంత్రం 4 గంట‌ల నుండి బిక్ష‌ట‌న‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు. అదేరోజు రాత్రి పంచ‌క‌ళ్యాణి వాహ‌నంపై సోమ‌స్కంద‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు.
 
* డిసెంబ‌రు 9న ఉద‌యం పురుష‌మృగ వాహ‌నంపై చంద్ర‌శేఖ‌ర‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు. రాత్రి కైలాస రావ‌ణ వాహ‌నంపై సోమ‌స్కంద‌మూర్తి మాఢ‌వీధుల‌లో ఊరేగింపు.
 
* డిసెంబ‌రు 10న ఉద‌యం 4 గంట‌ల‌కు అరుణాచ‌లేశ్వ‌ర ఆల‌యంలో భ‌ర‌ణీదీపం. అదేరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హాదీపం. మ‌రియు అరుణ‌గిరిపై దీప‌నాడార్ వంశ‌స్తులు తీసుకొచ్చిన 600 మీట‌ర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభ‌వంగా మ‌హాదీపోత్స‌వం జ‌రుగుతుంది. 
 
* డిసెంబ‌రు 11న అయ్య‌న్ కొల‌నులో చంద్ర‌శేఖ‌ర‌మూర్తి తెప్పోత్స‌వం. డిసెంబ‌రు 12న ఉద‌యం సోమ‌స్కంద‌మూర్తి గిరిప్ర‌ద‌క్ష‌ణ‌. అదేరోజు రాత్రి ప‌రాశ‌క్తి తెప్పోత్స‌వం
 
. డిసెంబ‌రు 13న రాత్రి సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి తెప్పోత్స‌వం
. డిసెంబ‌రు 14న చండికేశ్వ‌రుని తెప్పోత్స‌వంతో కార్య‌క్ర‌మం ముగియును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (29-11-2019) దినఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించినా...