Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

64 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం-ఎప్పుడు బెంగళూరుకు చేరుకుంటుందో?

Advertiesment
64 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం-ఎప్పుడు బెంగళూరుకు చేరుకుంటుందో?
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (19:14 IST)
300 టన్నులు, 64 అడుగుల శ్రీ మహావిష్ణువు రాత్రి విగ్రహం బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటుందా అని భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వేలాది మంది భక్తుల మధ్య ఈ ఏకశిలా విగ్రహం.. విల్లుపురం నుంచి తిరువన్నామలైకి చేరుకుంది. బెంగళూరుకు వెళ్లే దారిలో ఈ మహావిష్ణువు విగ్రహం తరలివెళ్తోంది. 240 టైర్ల ట్రైలర్‌తో ఈ విగ్రహాన్ని తరలించే ఏర్పాటు చేశారు. 
 
విశ్వరూపంతో కూడిన ఈ మహావిష్ణువు విగ్రహం ప్రస్తుతం సెంజి (విల్లుపురం జిల్లా)లో ఆగింది. ఇక్కడి నుంచి 155 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుంటుంది. సెంజి మార్గంగా ఈ విష్ణువు విగ్రహాన్ని తీసుకెళ్తే.. పలు గృహాలు కూలిపోయే అవకాశం వుంది. అందుకే ఈ విగ్రహాన్ని వేరే మార్గం ద్వారా తరలించాలని స్థానికులు కోరడంతో ఆ విగ్రహ బరువు మరికొంత తగ్గించేందుకు శిల్పకళాకారులు పనులు మొదలెట్టారు. ఈ విగ్రహాన్ని కోరకోట్టై (వందవాసి తాలూకా, తిరువన్నామలై జిల్లా)లోకి కొండ రాతితో ఏకశిలగా చెక్కారు. 
 
ఈ విగ్రహాన్ని 240 టైర్లతో కూడిన ట్రైలర్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరువన్నామలై జిల్లాకు చేరుకున్న ఈ విగ్రహం ఆపై హోసూర్ చేరుకుని అక్కడ నుంచి బెంగళూరుకు చేరుకుంటుందని ముంబై ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ చెప్తోంది. ఈ విగ్రహ తరలింపులో 30మంది రెషమ్‌సింగ్ గ్రూప్‌కు చెందిన వారు తలమునకలయ్యారు. జియోలజీ మైనింగ్ శాఖ ఇందుకు 2014లో అనుమతులు ఇచ్చింది. 
 
420 క్యూబిక్ మీటర్లతో సదానంద ట్రస్టు ఆధ్వర్యంలో ఈ రాతి శిల్పాన్ని చెక్కారు. ఏడుతలల ఆదిశేషువుతో కూడిన విగ్రహం బెంగళూరు చేరుకునేందుకు ఒక నెలకాలం పట్టే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని మార్గమధ్యంలోనే భారీ స్థాయిలో భక్తులు దర్శించుకుని పసుపు కుంకుమలను సమర్పించుకుంటున్నారు. 
 
108 అడుగుల శ్రీ మహావిష్ణువు విశ్వరూప విగ్రహాన్ని బెంగళూరులో ప్రతిష్టించాలని ఓ వైద్యుడు సంకల్పించుకుని ఈ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. విగ్రహం బెంగళూరుకు తరలించడంలో భాగంగా కోదండరామస్వామి ట్రస్టుకు సహాయం చేసేందుకు.. తిరువన్నామలై కలెక్టర్‌ ను ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 ఏళ్ల మగాడు కూడా నన్నలా చూస్తాడు... తారా చౌదరి