Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణ చిత్రం జనవరి 28న విడుదల

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (18:14 IST)
Karna poster
టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ చిత్రానికి అన్నీ తానై పని చూసుకుంటున్నారు కళాధర్ కొక్కొండ. ఆయనే స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే చేయడం విశేషం. ఈ సినిమాకు ప్రశాంత్ BJ సంగీతం అందిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు TNR జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ప్రశాంత్ BJ అందించిన మ్యూజిక్ పాటలో వస్తున్న సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఈ పాటలో చూపించిన సన్నివేశాలతో ఈ మూవీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని తెలుస్తోంది. 
 
''భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు'' అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా సాగిపోతున్న ఈ పాటలో ప్రతి సన్నివేశం డైరెక్టర్ ప్రతిభను బయటపెడుతోంది. ఈ 'కర్ణ' సినిమాలో హీరో కళాధర్ కొక్కొండ రోల్ ఎంత బలంగా ఉండనుందో ఈ థీమ్ సాంగ్ వెల్లడిస్తోంది. హీరో డిఫరెంట్ లుక్ సినిమాకు మరో అసెట్ కానుందని తెలుస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments