Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీతో డేటింగ్‌కు ఎందుకు ఇష్టపడ్డానంటే... బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈమెకు రాహుల్ గాంధీ అంటే అమితమైన ప్రేమ.. పిచ్చి. ఈ కారణంగానే తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ... అతనితో డేటింగ్ చేయాలని పరితపించింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (12:58 IST)
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈమెకు రాహుల్ గాంధీ అంటే అమితమైన ప్రేమ.. పిచ్చి. ఈ కారణంగానే తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ... అతనితో డేటింగ్ చేయాలని పరితపించింది. కానీ, అది సాధ్యపడలేదు. ఈ విషయం తాజాగా ప్రముఖ జర్నలిస్టు రషీద్ కిద్వాయీ తన పుస్తకం 'నేతా అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'లో వెల్లడించారు.
 
ఈ పుస్తకంలో రాసిన వివరాల మేరకు కరీనాకపూర్ 2002లో రాహుల్ గాంధీని ఇష్టపడగా, రాహుల్ కూడా కరీనా నటించిన సినిమా విడుదలైన రోజు తొలి ఆటను చూసేవారని పేర్కొన్నారు. అప్పట్లో కరీనాకపూర్ ఒక షోలో... సమాధానం చెప్పేందుకు సంశయిస్తూనే తాను రాహుల్‌తో డేట్‌ను ఇష్టపడతానని చెప్పారు. తాను సినీ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చానని, రాహుల్ రాజకీయ కుటుంబానికి చెందినవారని, తమ కుటుంబాల మధ్య సంబంధాలున్నాయని తెలిపారు. 
 
కానీ, ఇదే అంశంపై 2009లో కరీనా కపూర్ స్పందిస్తూ, 'అది ఒకప్పటి విషయం. అప్పట్లో నేను అలా ఎందుకు చెప్పానంటే... మా ఇద్దరి ఇంటిపేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్నాను. నేను అతనితో డేట్ చేయాలని అనుకోవడం లేదని' స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments