Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిగతా హౌస్‌మేట్స్‌కు ఎలా స్పాట్ పెట్టానో తెలుసా...? కౌశల్

113 రోజుల పాటు ప్రేక్షకులను టీవీకి కట్టిపడేసిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అనుకున్నట్లుగానే కౌశల్ గెలిచాడు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (11:48 IST)
113 రోజుల పాటు ప్రేక్షకులను టీవీకి కట్టిపడేసిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అనుకున్నట్లుగానే కౌశల్ గెలిచాడు. ఈ విషయాన్ని ప్రకటించగానే బయట ఉన్న కౌశల్ ఆర్మీ సెలిబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. ఇదంతా చూస్తే ముందుగానే విన్నర్ తెలిసిపోయినట్లనిపించింది. ఇక కౌశల్ ఆ సెలిబ్రేషన్స్‌లో తన కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
 
హౌస్‌లో ఎంటర్ అయిన వెంటనే ముందు తనకేమీ అర్థం కాలేదని, అందరి గురించి అర్థం చేసుకోవడానికి దాదాపు వారంపైనే పట్టిందని చెప్పాడు. ఆ తర్వాత నా అసలైన గేమ్ మొదలుపెట్టాను. డైనింగ్ టేబుల్ దగ్గర తేజస్వీతో పెద్ద గొడవ జరిగిన దాని గురించి ప్రస్తావించాడు. హౌస్‌లో అందరూ డైనింగ్ టేబుల్‌పై తింటుంటే నువ్వెందుకు సోఫాలో కూర్చుని తింటున్నావని ప్రశ్నించాను. ఆ సమయంలో జరిగిన గొడవలో తేజస్వి నన్ను చాలా చాలా మాటలు అన్నారు. అప్పటి నుండి ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి అని నేర్చుకున్నాను.
 
నేను అన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటానని, నేను అక్కడ ప్లాన్ చేసి నామినేషన్స్‌లో పెడితే మీరు ఇక్కడ వాళ్లని ఎలిమినేట్ చేసారని కౌశల్ తెలిపాడు. నేను లేని సమయంలో బాబు గోగినేని గారు నన్ను ఉద్దేశించి హౌస్‌మేట్స్‌తో మనమందరం కౌశల్‌ని బయటకు పంపించేందుకు చూడాలి అని అన్నారు. నేను ఒక్కో హౌస్‌మేట్‌ను బయటకు పంపించడానికి చాలా వర్క్ చేసాను. 
 
అయితే బాబు గారి విషయంలో మాత్రం అంత శ్రమ పడలేదని, ఆయన ఈజీగా ఎలిమినేట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. తాను హౌస్‌లో ఒంటరిగా ఉన్నట్లు కనిపించాను, కానీ గార్డెన్‌లో, వరండాలో నడుస్తూనే ఒక్కొక్కరికీ ఎలా స్పాట్ పెట్టాలో ఆలోచించానని చెప్పాడు. అంటే మొత్తానికి మనోడు పైకి కనిపించినట్లు కాదన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments