Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో "కాంతార" ప్రభంజనం - మొదటి రోజు రూ.5 కోట్లు గ్రాస్

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (13:51 IST)
'కెజీఎఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్ని నిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్‌లో నిర్మించిన తాజా చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం చూపిస్తుంది. 
 
థియేటర్స్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. "కాంతార" రిలీజైన మొదటి రోజే రూ.5 కోట్లు గ్రాస్ సాధించింది. 
 
ముఖ్యంగా ఈ "కాంతార"  క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్‌లో వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు. థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్‌ను మలిచాడు. 
 
తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేశాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు "కాంతార" క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అదే మాదిరిగా విజయఢంకాను మోగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments