Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rishab Shetty: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు

దేవీ
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (15:29 IST)
Kantara: Chapter 1 Trailer Record
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ "కాంతార" బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .  2022లో విడుదలైన ఈ చిత్రం ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.

అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది.  ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
 
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మేకింగ్ గురించి, గ్రాండియర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ గురించి, హోంబలే ఫిలింస్‌ నిర్మాణ విలువల గురించి  చర్చ జరుగుతోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు.. యూపీలో కుల ప్రస్తావన ఇక వుండదు..

Naga Babu: అసెంబ్లీలో నాగబాబు తొలి ప్రసంగం.. ఎక్కడా వైకాపా పేరెత్తలేదు.. (video)

ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చి బాత్రూమ్‌లో ప్రసవం.. బిడ్డను బక్కెట్‌లో వదిలి...

నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments