Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Advertiesment
Kanthara Chapter 1

డీవీ

, సోమవారం, 22 సెప్టెంబరు 2025 (19:11 IST)
Kanthara Chapter 1
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ కాంతార బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం పాన్-ఇండియా లెవెల్‌లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్- పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతారా: చాప్టర్ 1 ట్రైలర్‌ని రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? అనే డైలాగ్‌తో మొదలైన  ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది.
 
''ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడ్డానికి ఆ ఈశ్వరుడు తన గణాలని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాల వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో'' అనే డైలాగ్ కాంతారా ఎసెన్స్‌ని ప్రజెంట్ చేసింది. ట్రైలర్ చివర్లో  ఈశ్వరుడి దర్శనం గూజ్ బంప్స్ తెప్పించింది.
 
రిషబ్ శెట్టి ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. యాక్షన్ సీన్స్‌లో నెక్స్ట్ లెవల్‌లో కనిపించారు. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ అద్భుతంగా కనిపించింది. రిషబ్ శెట్టి, రుక్మిణి ప్రేమ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
 
దర్శకుడిగా రిషబ్ శెట్టి అద్బుతాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. అరవింద్ ఎస్ కశ్యప్ కెమరా వర్క్ మార్వలెస్ గా వుంది. బి అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్ డిజైనర్ వినేశ్ బంగ్లాన్ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. హోంబలే ఫిలింస్‌ ప్రొడక్షన్ వాల్యూస్ వరల్డ్ క్లాస్ లో వున్నాయి.
 
విజువల్ వండర్ గా నిలిచిన కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల