Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

ఠాగూర్
మంగళవారం, 27 మే 2025 (13:22 IST)
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం హార్డ్ డిస్క్‌ చోరీకి గురైంది. 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన హార్డ్ డిస్క్ అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫిల్మ్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 'కన్నప్ప' చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు.
 
అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్ డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో.. తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments