Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి రేఖా సింధు మృతి: మరో ముగ్గురు కూడా?

టాప్ మోడల్, యాంకర్, నటి సోనికా చౌహాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. మరో కన్నడ నటి రేఖా సింధు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందింది. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తుండగా ఆమె కారు పె

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (15:43 IST)
టాప్ మోడల్, యాంకర్, నటి సోనికా చౌహాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. మరో కన్నడ నటి రేఖా సింధు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందింది. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తుండగా ఆమె కారు పెర్నాంబట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ  ఘోర రోడ్డు ప్రమాదంలో రేఖా సింధుతో పాటు మరో మగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మృతి చెందిన వారిని అభిషేక్ కుమారన్ (22), జయచంద్రన్ (23), రక్షణ్ (20)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కన్నడ సీరియల్ నటి అయిన సింధు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పలువురు సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి చెందారు. కన్నడ బుల్లితెర నటులు శోకసముద్రంలో మునిగిపోయారు. సింధు రేఖా కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే గత శనివారం టాప్‌ మోడల్‌, యాంకర్‌, నటి సోనికా చౌహాన్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్‌ ఛటోపాధ్యాయతో కలిసి కారులో వెళుతుండగా శనివారం ఉదయం లాకేమాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌‌ను ఢీకొని అనంతరం పేవ్‌మెంట్‌ ఎక్కేసింది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకుని, తీవ్రంగా గాయపడిన బిక్రమ్‌, సోనికాను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ సోనికా అప్పటికే మరణించినట్లు వైద్యు నిర్ధారించారు. విక్రమ్ గాయాల నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments