Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'రాజు'... కులగజ్జి, మోహన్ బాబు కామెంట్లపై దుమారం...

తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు యావత్భారతావని చిత్ర పరిశ్రమ స్టామినా చూపిస్తున్న బాహుబలి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్‌కు కులగజ్జి అంటించే పని జరుగుతోందని దుమారం చెలరేగుతోంది. బాహుబలి చిత్రం విడుదలకు ముందంతా ప్రభాస్ అని సంబోధించినవారు తాజాగా ప

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (15:37 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు యావత్భారతావని చిత్ర పరిశ్రమ స్టామినా చూపిస్తున్న బాహుబలి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్‌కు కులగజ్జి అంటించే పని జరుగుతోందని దుమారం చెలరేగుతోంది. బాహుబలి చిత్రం విడుదలకు ముందంతా ప్రభాస్ అని సంబోధించినవారు తాజాగా ప్రభాస్ 'రాజు' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అసలు హీరోలకు కులం కార్డుతో సంబంధం లేదని గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తదితర మహానటులు నిరూపించారు కూడా. 
 
నటులకు కులం లేదని, తమదంతా కళాకారుల కులం అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు. ఐతే ఇప్పుడు కొత్తగా ప్రభాస్‌ను ప్రభాస్ రాజు అని ప్రత్యేకంగా చెప్పడం వివాదాస్పదంగా మారింది. బాహుబలి చిత్రాన్ని పొగుడుతూ కలెక్షన్ కింగ్... దేశాన్ని ఒకప్పుడు రాజులు ఏలేవారనీ, ఇప్పుడు ఇండియన్ సినీ ప్రపంచాన్ని ప్రభాస్ రాజు ఏలేస్తున్నాడని అన్నారు. 
 
ఐతే మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రత్యేకించి కులాన్ని పట్టి చూపించేది కాదనీ, కేవలం ఆయన ప్రభాస్ నటన గురించి, ఇండియన్ సినీ ఇండస్ట్రీని బాహుబలి కింగ్‌లా ప్రపంచం ముందు నిలబడేట్లు చేసిందని చెప్పేందుకే ఈ కామెంట్లు చేశారని అర్థం చేసుకోవాలంటున్నారు. సహజమే... ఓ సక్సెస్ వచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి పొగడ్తలు వచ్చిపడుతుంటాయి. ఆ పొగడ్తల్లోకి మరీ లోతుగా చూసి జల్లెడపడితే తేడాగా ఉందే... అనిపించేవారికి అనిపించవచ్చు. కానీ అది పొగడ్తగా మాత్రమే తీసుకుంటే అంతవరకే వుంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments