Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ బిల్లు చూసి పత్తాలేకుండా పారిపోయిన హీరోయిన్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (09:40 IST)
'దండుపాళ్యం' ఫేం పూజా గాంధీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో ఉండే పూజా తాజాగా ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కి బిల్లుక‌ట్ట‌కుండా ప‌రార‌య్యింద‌ట‌. దీంతో హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌ని ఆశ్ర‌యించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో గ‌దిని పూజా గాంధీ అద్దెకి తీసుకున్నారు. హోట‌ల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకుంది. దీంతో ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో పత్తాలేకుండా పారిపోయింది. 
 
ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గ్ర‌హించిన హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు న‌మోదు చేసి స‌మ‌న్లు జారీ చేశారు. ఈ సమన్లు అందుకున్న పూజాగాంధీ పోలీసుల ముందుకు వచ్చారు. తాను హోట‌ల్‌కి రూ. 2 లక్ష‌లు చెల్లించిన‌ట్టు వెల్ల‌డించింది. మిగ‌తా మొత్తం చెల్లించ‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని కోరింది. దీనికి హోట‌ల్ యాజ‌మాన్యం ఓకే చెప్ప‌డంతో వివాదం స‌మ‌సింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments