Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన నా భర్త.. కాదు నా మొగుడు.. కన్నడ నటుడి కోసం రోడ్డెక్కిన ఇద్దరు భార్యలు

ఓ భర్త కోసం ఇద్దరు భార్యలు రోడ్డెక్కారు. ఆయన నా భర్త అని ఒకరు అంటే.. కాదు నా మొగుడు అంటూ మరొకరు అన్నారు. ఇలా ఇద్దరు భార్యలు రోడ్డెక్కడంతో విషయం కాస్త స్టేషన్‌ వరకు వెళ్లింది. ఇంతకీ ఆ భర్త ఎవరో కాదు..

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (17:47 IST)
ఓ భర్త కోసం ఇద్దరు భార్యలు రోడ్డెక్కారు. ఆయన నా భర్త అని ఒకరు అంటే.. కాదు నా మొగుడు అంటూ మరొకరు అన్నారు. ఇలా ఇద్దరు భార్యలు రోడ్డెక్కడంతో విషయం కాస్త స్టేషన్‌ వరకు వెళ్లింది. ఇంతకీ ఆ భర్త ఎవరో కాదు.. కన్నడ నటుడు దునియా విజయ్. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కన్నడ చిత్ర సీమలో దునియా విజయ్ అనే నటుడు ఉన్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య పేరు నాగరత్న, చిన్న భార్య పేరు కీర్తి. వీరిద్దరూ ఇపుడు భర్త కోసం గొడవపడ్డారు. నాగరత్నకు ముగ్గురు పిల్లలున్నారు. కానీ, ప్రస్తుతం విజయ్‌ చిన్నభార్య కీర్తిగౌడతో ఉంటున్నాడు. 
 
అయితే, గతంలో దునియా విజయ్... మారుతి గౌడ అనే జిమ్ ట్రైనర్‌తో గొడవపడ్డాడు. దీనిపై విజయ్‌పై కేసు కూడా నమోదైవుంది. ఈ గొడవ జరిగిన సమయంలో నాగరత్న కుమారుడు సామ్రాట్‌ కూడా తన తండ్రితోనే ఉన్నాడు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా, ఆమె దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారు. 
 
దీంతో బౌన్సర్‌ల ద్వారా దాడి చేయించారని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాగరత్న ఫిర్యాదు చేసింది. అనంతరం కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌స్టేషన్‌లకు వెళ్ళి ప్రతి ఫిర్యాదు చేసింది. ఇలా పోలీస్‌ స్టేషన్‌తోపాటు కోర్టు, జైలు చుట్టూ దునియా విజయ్‌ తిరుగుతుండగా ఇటువైపు భార్యలు పోలీ‌స్‌ స్టేషన్‌లకు వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా, విజయ్ తన భర్త అంటే.. కాదు నా మొగుడు అంటూ కీర్తిగౌడ, నాగరత్నలు పోట్లాడుకోవడాన్ని చూసిన పోలీసులు కూడా ఏం చేయాలో దిక్తుతోచలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments