Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనికాకు నాలుగోసారి పాజిటివ్... ఆందోళనలో ఫ్యామిలీ మెంబర్స్

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:07 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడినవారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమెకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నాలుగుసార్లూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెను ఇంటికి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆమె కుటుబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా గాయని కనికా కపూర్‌కు నాలుగోసారి రక్తపరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. 
 
తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20వ తేదీన కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments