"కంగువ" ప్రీ బుకింగ్స్.. అమెరికాలో అదుర్స్.. మేకర్స్ హ్యాపీ

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (11:25 IST)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబినేషన్‌లో "కంగువ" మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు మేకర్స్. అందుకే ప్యాన్ ఇండియా స్థాయిలో ‘కంగువ’ హిట్ అవ్వాలని ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేశమంతా చుట్టేస్తూ ఈ సినిమాను చూడమని ప్రేక్షకులకు చెప్తుండగా అమెరికాలో ‘కంగువ’ ప్రీ బుకింగ్స్ మేకర్స్‌ను హ్యాపీ చేస్తున్నాయి.

అమెరికాలో ఇండియన్ హీరోలకు బాగానే మార్కెట్ ఉంది. ప్రీ బుకింగ్స్ విషయంలో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలో ప్రీ బుకింగ్స్ వల్ల ‘కంగువ’ ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ స్వయంగా రివీల్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్‌లో కూడా తమిళంతో పాటు ఇతర సౌత్ భాషల్లో కంగువ విడుదలకు సిద్ధమయ్యింది.

అమెరికా వ్యాప్తంగా ‘కంగువ’ ప్రీ బుకింగ్స్‌ వల్ల 125 వేల డాలర్లు కలెక్ట్ అయ్యిందని, ఇంకా ఈ ప్రీ బుకింగ్స్ కొనసాగుతున్నాయని మేకర్స్ ప్రకటించారు. దీంతో సైలెంట్‌గానే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments