Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురట్చితలైవి కోసం వెన్ను భాగం దెబ్బతింది.. కంగనాపై కేసు..?

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (13:11 IST)
వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రస్తుతం పురట్చితలైవీ జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తలైవీ పేరుతో ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న ఈ బయోపిక్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కంగనా లుక్స్ ఇప్పటికే విడుదల కాగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
ప్రతి సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో పని చేసే కంగనా రనౌత్ తలైవీ మూవీ కోసం ఏకంగా 20 కేజీలు పెరిగింది. అంత బరువుతో భరతనాట్య చేయడంతో వెన్ను భాగం దెబ్బతిందని కంగనా తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఏడు నెలల సమయం కూడా సరిపోలేదట. ప్రస్తుతం కంగనా రనౌత్ తేజస్, దాకడ్ అనే సినిమాలు కూడా చేస్తుంది.
 
ఇదిలా ఉంటే..  బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. 
 
వివిధ న్యూస్‌ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకుభంగం కలిగించేలా వ్యాఖ్యానించిందని కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కంగనా తన పేరును అనవసరంగా లాగిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments