Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు పోరాటం గురించి, ఇందిరా గాంధీ పాత్ర గురించి కంగ‌నా ఏమంది!

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (15:36 IST)
Kangana as Indiragandhi
బాలీవుడ్ న‌టి కంగ‌రా ర‌నౌత్ రోజూ ఏదోర‌కంగా వార్త‌ల్లోకి ఎక్కుతుంటుంది. త‌న భావాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తుంది. తాజాగా రిపబ్లిక్ డే నాడు రైతు నాయ‌కుల ఉద్య‌మంపైనా స్పందించింది. రైతు పోరాటం వెనుక వున్న‌వారినంద‌రినీ జైలులో పెట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది. ఇన్ని రోజుల పోరాటం చేస్తుంటే `దేశ్‌, సుప్రీంకోర్ట్ స‌బ్ కే మజాక్ బ‌న్‌కే ర‌హేగయా!` అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. 
 
ఇక తాజాగా ఆమె `త‌లైవి` సినిమాలో జ‌య‌ల‌లిత పాత్ర‌ను పోషిస్తోంది. బ‌యోపిక్‌లో న‌టించ‌డం ఆనందంగా వుంద‌ని పేర్కొంది. అదేవిధంగా ఈసారి మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు వెల్ల‌డింది. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఒక రాజకీయ నాటకంగా ఆమె పేర్కొంది. అయితే ఇంకా పేరు పెట్టని ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ దశలో వుంది. త‌లైవి పూర్త‌య్యాక ఈ పాత్ర గురించి క‌స‌ర‌త్తు చేయ‌నున్న‌ట్లు చెబుతుంది. కంగనా మాట్లాడుతూ, ఇది ఇందిరా గాంధీ యొక్క బయోపిక్ కాదు, ఇది ఒక గొప్ప కాలం చిత్రం, ఇది ఒక రాజకీయ నాటకం, ఇది నా తరానికి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత భారతదేశం యొక్క రాజకీయ ప్రకృతి దృశ్యం అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments