Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ రోషన్‌కు బిటౌన్ మద్దతు.. కంగనా నిలదొక్కుకోగలదని రంగోలి ఫైర్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ ఒంటరిగా నిలిచిపోయింది. హృతిక్ రోషన్ వివాదంతో కంగనా రనౌత్‌కు మద్దతు పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ ప్రముఖులంతా హృతిక్‌కే మద్దతివ్వడంతో కంగనా ఏకాకిగా మిగిలిపో

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:42 IST)
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ ఒంటరిగా నిలిచిపోయింది. హృతిక్ రోషన్ వివాదంతో కంగనా రనౌత్‌కు మద్దతు పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ ప్రముఖులంతా హృతిక్‌కే మద్దతివ్వడంతో కంగనా ఏకాకిగా మిగిలిపోయింది. గత కొంత కాలంగా బాలీవుడ్‌ను హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వివాదం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ల పాటు మౌనంగా వుండిన హృతిక్‌ తాజాగా నోరువిప్పడంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా హృతిక్‌‌కే మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు హృతిక్‌ రోషన్‌కు మద్దతునిస్తూ ఫర్హాన్‌ అఖ్తర్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. 
 
తన సహనటుడు ఓ అమ్మాయి పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడంటే తాను నమ్మనంటూ ఓ పోస్ట్ చేశాడు. ఈ విషయంపై మాట్లాడే హక్కు లేదు. కానీ దీనిని సైబర్ క్రైమ్ అధికారులే పరిష్కరిస్తారని.. సమాజంలో ఎప్పుడూ మహిళలే అన్యాయానికి గురవుతుంటారు. కొన్ని ఘటనల్లో ఇది వాస్తవమే. అయితే ప్రతీ విషయంలో పురుషుడిదే తప్పంటే మాత్రం తాను అంగీకరించను. పురుషులపై కూడా అకృత్యాలు జరిగాయి. వారూ ఎంతో అనుభవించారు. ఈ వాస్తవాన్ని న్యాయస్థానాలు కూడా ఒప్పుకొన్నాయని గుర్తు చేశారు. 
 
కానీ హృతిక్‌ విషయంలో జరిగే అన్యాయాన్ని సహించలేక స్పందించాల్సి వస్తోంది. కంగన, హృతిక్‌ వివాదాన్ని మీడియా చూపించిన తీరు సరైనది కాదు. కేవలం యువతి కంగన చేస్తున్న ఆరోపణలతోనే పేరున్న పాత్రికేయులు తప్పు హృతిక్‌దేనని చెప్పడం సబబు కాదన్నాడు. దీనికి అక్షయ్ కుమార్ భార్య, సినీనటి ట్వింకిల్‌ ఖన్నా, యామి గౌతమ్‌, సోనాలి బింద్రేలు, కరణ్‌ జొహార్‌, సోనమ్‌ కపూర్‌ మద్దతు తెలిపారు. 
 
అంతేగాకుండా వారంతా హృతిక్‌కి మద్దతుగా ట్వీట్లు చేశారు. దీనిపై కంగనా రనౌత్ సోదరీ రంగోలీ ఫైర్ అయ్యింది. ఫర్హాన్‌ను సమర్థించిన వారిని ఉద్దేశిస్తూ.. డియర్ ఫర్హాన్.. మీరు కేవలం రోషన్ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ఈ పోస్టు రాయకుండా ఉండి ఉంటే అభినందించే దాన్ని. మొత్తం చిత్ర పరిశ్రమ కంగనకు వ్యతిరేకంగా నిలబడినా ఆమె నిలదొక్కుకోగలదని ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments