స్నేహితులారా.. నా సిద్ధాంతం చాలా సులభం... అలాంటివారికి సారీ చెబుతున్నా... కంగనా

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (14:40 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడివుంటే అలాంటి వారంతా తనను క్షిమించాలని కోరారు. ఆమె గురువారం తన 36వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డే బేబీ గురువారం తన ఇన్‌స్టా ఖాతాలో తన అభిమానులను, ఫాలోయర్లను, ద్వేషించేవారిని ఉద్దేశించి పలు పోస్టులు చేశారు. 
 
స్నేహితులారా నా సిద్ధాంతం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలనే నేను ఎపుడూ కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధ పెట్టివుంటే అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, "నా శత్రువులు నన్ను విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా చేశారు. నేను ఎంత విజయం సాధించామన్నది ముఖ్యం కాదు. కానీ, నన్ను నా పాదాలపై నిలుచుని విజయపథంలో నడిచేలా చేశారు. ఎలా పోరాడాలో నేర్పించారు. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని" అని కంగనా రనౌత్ పోస్ట్ చేశారు. 
 
కాగా, ఆమె తన పుట్టిన రోజును పురస్కరించుకుని గులాబీ రంగు అంచున్న ఆకుపచ్చ రంగు చీరను ధరించి, ఓ వీడియోను షేర్ చేశారు. మెడ మొత్తం బంగారం నెక్లెస్‌తో అలంకరించుకుంది. తనకు మద్దతు నిలిచిన తన తల్లిదండ్రులు, తనకు బోధించిన గురువులకు ధన్యవాదాలు. ఆ తర్వాత తనను ద్వేషించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, తాను ఎవరినైనా బాధించివుంటే మన్నించాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments