Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి ప్రసంగంపై కంగనా రనౌత్ ప్రశంసల వర్షం

Kangana Ranaut
, సోమవారం, 16 జనవరి 2023 (17:08 IST)
దర్శకధీడురు ఎస్ఎస్ రాజమౌళి ప్రసంగంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో క్రికిట్స్ చాయిస్ అవార్డు 2023 వరించింది. ఈ సందర్భంగా రాజమౌళి భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై కంగనా రనౌత్ స్పందించారు. రాజమౌళి చేసిన ప్రసంగం వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కంగనా.. తన స్పందనను తెలియజేశారు. 
 
"అమెరికా సహా చాలా ప్రాంతాల్లో భారతీయులు అధికంగా అర్జిస్తూ విజయవంతమైన కమ్యూనిటీగా ఉన్నారు. ఏమీలేని స్థితి నుంచి దీన్ని ఎలా సాధించామా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇందులో చాలా వరకు మన బలమైన కుటుంబ వ్యవస్థ నుంచే వస్తోంది. మనం ఎంతో భావోద్వేగపరమైన ఆర్థిక, మానసిక మద్దతును మన కుటుంబాల నుంచి పొందుతుంటాం. స్త్రీ వల్ల కుటుంబాల ఏర్పాటవుతాయి. కుటుంబాలను వారే పోషిస్తూ కలిసి ఉంచుతారు" అని కంగనా పేర్కొన్నారు. 
 
నా జీవితానికి ఆమె ఓ డిజైనర్ : రాజమౌళి 
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన "ఆర్ఆర్ఆర్" మూవీకి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డును క్రిటిక్స్ చాయిస్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రాజమౌళి కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో భారతీయతను తలపించడమే కాకుండా, ఎంతో మంది మనసులను గెలుచుకుంది. ఆయన అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. చివరికి మేరా భారత్ మహాన్ అంటూ ముగించారు. 
 
"ఈ అవార్డును నా జీవితంలోని మహిళలు అందరికీ అంకితం ఇస్తున్నాను. మా అమ్మ రాజనందిని పాఠశాల విద్య కంటే కూడా నన్ను కామిక్స్, స్టోరీ పుస్తకాలు ఎక్కువ చదివేలా ప్రోత్సహించింది. నాలో సృజనాత్మకతను ప్రోత్సహించింది. మా వదిన శ్రీవల్లి (నాకు అమ్మ వంటిది) ఎప్పుడూ కూడా నేను జీవితంలో మెరుగ్గా ఉండాలని కోరుకునేది. 
 
నా జీవిత భాగస్వామి రమ, నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినా, నా జీవితానికి ఆమె డిజైనర్. ఆమే లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదు. నా కుమార్తెలు ఏమీ చేయక్కర్లేదు. వారి చిరునవ్వు చాలు నా జీవితాన్ని వెలగించడానికి" అని రాజమౌళి ప్రసంగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' 4 రోజుల కలెక్షన్లు ఇవే..