Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... అతనిపై మనసు పారేసుకున్నా : కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (16:54 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. వివాదాలకు మాత్రమే కాదు.. డేరింగ్ డాషింగ్ విషయంలోనూ అదుర్స్. అలాంటి నటి కంగనా రనౌత్.. తాజాగా ఓ విషయాన్ని బహిర్గతం చేసింది. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. అయితే, ఆ వ్యక్తి పేరున మాత్రం వెల్లడించలేదు. 
 
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశానని... ఇదేసమయంలో తన జీవితంలో ప్రేమ లేని రోజంటూ లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని తెలిపింది. తనకు స్ఫూర్తిగా నిలిచే ఒక తోడు కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. 
 
20 ఏళ్ల వయసులో తన సంబంధాలపై తనకు విభిన్నమైన ఆలోచనలు ఉండేవని... ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం కంగనా 'మెంటల్ హై క్యా' అనే చిత్రంలో బిజీగా గడుపుతోంది. ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే, కంగనా రనౌత్ ప్రకాష్‌పై మనసు పారేసుకుందా అనే సందేహాన్ని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments