Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారును ఎంటర్‌టైన్ చేస్తున్న కంగనా.. స్వామి కామెంట్స్..

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (20:26 IST)
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ గతంలో కంగనా ధరించిన బికినీ ఫొటోను షేర్ చేసింది. మోడీ ప్రభుత్వాన్ని ఎంటర్‍‌టైన్ చేస్తున్న లేడీ అంటూ కామెంట్ చేసింది. 
 
ఈ ట్వీట్‌పై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ కంగనాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కంగనాను రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే ఆమెకు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కంగనా కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే స్పందిస్తోందని అన్నారు. ఇది ఒక గౌరవం లేని సంస్థ అని విమర్శించారు.
 
ఈ వ్యాఖ్యలపై కంగనా ఫైర్ అయింది. తన శరీరాన్ని ఉపయోగించుకునే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనుకుంటున్నారని ఆమె మండిపడింది. తన స్విమ్ సూట్ ఫొటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే... ఆయన స్వభావం ఏమిటో అర్థమవుతోందని అన్నారు. మహిళల విషయంలో ఆయన వక్రబుద్ధి అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
తన స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదని... వారికి కూడా మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి అవయవాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురుషుడి మాదిరే గొప్ప నేతగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం