Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌మ‌ల్ - శంక‌ర్‌ల భార‌తీయుడు 2 స్టోరీ లీకైంది... ఇంత‌కీ స్టోరీ ఏంటి..?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (21:35 IST)
యూనీవ‌ర్శ‌ల్ హీరో కమల్‌హాసన్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ భార‌తీయుడు 2. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఆగిపోయింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ... ఇటీవ‌ల మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. విష‌యం ఏంటంటే.. క‌మ‌ల్ ఈ సినిమాకి రెమ్యూన‌రేష‌న్ కాస్త ఎక్కువుగా డిమాండ్ చేసాడ‌ట‌. అందుక‌నే ఆగింది. మొత్తానికి క‌మ‌ల్ మెట్టు దిగి వ‌చ్చాడు. పారితోషికం తగ్గించుకున్నాడు. దానివల్లే సినిమా షూటింగ్‌ మొదలైంది.
 
కమల్ హాసన్, ప్రియా భవానీ శంకర్‌లపై వచ్చే సన్నివేశాలు దర్శకుడు శంకర్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. ఐతే ఆమె సీన్లు ఇపుడే తీయరు. కమల్‌హాసన్‌తో పాటు దర్శకుడు శంకర్‌ కూడా తమ పారితోషికాల్లో 50 శాతం తగ్గంచుకున్నారు. వారు తగ్గిన తర్వాతే నిర్మాణ సంస్థ లైకా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కి అవకాశం ఇచ్చింది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా కథ ఏంటంటే... ఈ మూవీ స్టోరీ సిద్దార్థ్‌తో మొదలవుతుందట. సిద్దార్థ్‌ ఈ సినిమాలో వీడియో బ్లాగర్‌గా నటిస్తున్నాడు. సమాజంలో జరిగే అన్యాయాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు సిద్దార్థ్‌. ఇంత ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేవారు లేరా అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు. ఆ వీడియో చూసిన... సేనాపతి అదేనండి క‌మ‌ల్ హాస‌న్ తిరిగి వస్తాడు.
 
భారతీయుడు సినిమాలోనే తాతగా కనిపించిన కమల్‌హాసన్‌ ఈ సినిమాలో ఇంకా పండు ముసలిగా కనిపిస్తాడు. వయసు మళ్లినా.. అతని ఎనర్జీ మారదు.. అన్యాయాలను ఎదుర్కొనే శక్తి తగ్గదు. ఎందుకంటే అతనికి సనాతన మర్మవిద్య తెలుసు. ఎప్పటికీ ఎనర్జీగా ఉండే విద్య అది. సేనాప‌తి ఏం చేసాడు..? ఎలా అన్యాయాల‌ను అరిక‌ట్టాడు అనేదే మిగిలిన స్టోరీ అని తెలిసింది.

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments