Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ శ‌స్త్ర చికిత్స.. కాలికి బ‌లంగా గాయాలు కావడంతో..?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (17:57 IST)
క‌మ‌ల్‌హాస‌న్ కాలికి శ‌స్త్ర చికిత్స చేసుకున్నాడ‌ని చెన్నై వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. గ‌తంలో ఆయ‌న విశ్వ‌రూపం సినిమా చిత్రీక‌ర‌ణ‌లో కూడా యాక్ష‌న్ స‌న్నివేశాలు చేసేట‌ప్పుడు చేతుల‌కు కాలికి బ‌లంగా గాయాల‌య్యాయి. అయితే ఈసారి కాలికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో చిన్న‌పాటి చికిత్స చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వివ‌రించారు. 
 
కమల్ తన సోషల్ మీడియా పేజీలో ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంటూ.., “బిగ్ బాస్ సీజన్ 4 ను నేను విజయవంతంగా పూర్తి చేశాను, ఇది కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ మరియు నిబంధనలు కఠినంగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. బిగ్ బాస్ ద్వారా నా నాలుగున్నర కోట్లకు పైగా ప్రజలతో సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అయితే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా, నా కాలికి శస్త్రచికిత్స జరిగింది. 
 
ఆ శస్త్రచికిత్సకు కొనసాగింపుగా, నేను తదుపరి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సలహా ఇచ్చారు. నా సోదరులు మరియు సోదరీమణులను అభివృద్ధి బాట పట్టించటానికి నేను ఎంచుకున్న రాజకీయ మార్గాన్ని కూడా నా బాధ్యతగా నిర్వహిస్తాను. కొంచెం ఆరోగ్యం మెరుగుపడగానే మళ్ళి సినిమా షూటింగ్ మొదలుపెడతాను అంటూ తెలిపారు కమల్. 
 
ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ అండ్ భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌కు దూరంగా వుండ‌డంతో క‌మ‌ల్ త‌న ప‌య‌నాన్ని కొన‌సాగిస్తాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments