Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2పై కళ్యాణ్ రామ్ ప్రశంసలు.. కీరవాణి సంగీతం మైనస్ అయ్యిందా?

బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో జక్కన్న అండ్ టీమ్‌పై ప్రశంసలతో పూలవర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి హీరో,

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (17:44 IST)
బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో జక్కన్న అండ్ టీమ్‌పై ప్రశంసలతో పూలవర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ బాహుబలి-2పై స్పందించారు. సినిమా అదరిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది బాహుబలిని క‌ట్ట‌ప్ప‌ ఎందుకు చంపాడని కాదని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. 
 
ఇంకా.. అసలు 'బాహుబలి-2'ని ఇంత గొప్పగా రాజమౌళి ఎలా తెరకెక్కించారో తెలుసుకోవాలని పేర్కొన్నాడు. బాహుబ‌లి-2లో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంద‌ని, రానా దగ్గుబాటి నటన అదిరిందని క‌ల్యాణ్ రామ్‌ వ‌రుస ట్వీట్లు చేశాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్,  అనుష్క, నాజర్.. ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించార‌ని కితాబిచ్చాడు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి అందించిన బ్రిలియంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ అని ట్విట్టర్లో తెలిపారు. 
 
అయితే బాహుబలి-2ని సంగీత దర్శకుడు కీరవాణి చెడగొట్టేశాడా అని టాక్ వస్తోంది. కీరవాణి సంగీతం సినిమా రేంజ్‌ను తగ్గించిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి సినిమా చూసిన సినీ విశ్లేషకులు మాత్రం బాహుబలి 2 కి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అతి పెద్ద ప్లస్‌గా నిలిచిందని చెప్పారు. ఇంకా కీరవాణి సంగీతం మైనస్ కాదని, ఆయన పాటలు కథకు తగ్గట్టే రాశారని.. బాహుబలి2 స్థాయిని అవి ఏమాత్రం తగ్గించలేదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments