Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్స్‌ ప్యాక్‌లో కళ్యాణ్‌ రామ్‌ 'ఇజం' .. ఫస్ట్ లుక్ అదుర్స్

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'.

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (19:28 IST)
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
సిక్స్‌ ప్యాక్‌లో డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్‌ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ... ''జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ కనిపిస్తారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్‌ సినిమా ఇది'' అన్నారు. 
 
డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్ ‌(ముంబై), రవి (ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments