Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత చిత్రాలతో పోలికలేని చిత్రం 'ఇజం' : నందమూరి కళ్యాణ్‌రామ్‌

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:04 IST)
డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. జూలై 5 డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోమవారం 'ఇజం' టైటిల్‌ను ఎనౌన్స్‌ చేసి, ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్ట్‌ 9 నుంచి నెలాఖరు వరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ, ''పూరితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, పూరితో చేస్తున్న 'ఇజం' చిత్రం మరో ఎత్తు. ఒక డిఫరెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది'' అన్నారు. 
 
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ, ''ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్తగా చాలా కొత్తగా కనిపిస్తాడు. జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే చిత్రమిది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్‌ సినిమా ఇది'' అన్నారు. 
 
ఈ చిత్రంలో డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments