Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు గా కళ్యాణ్ రామ్

దేవీ
గురువారం, 3 ఏప్రియల్ 2025 (17:08 IST)
Nandamuri Kalyan Ram
కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించిన చిత్రం 'అర్జున్ S/O వైజయంతి'. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. తల్లి కోరిక కోసం కొడుకు ఏం చేశాడనే పాయింట్ తో వయొలెన్స్ మిక్స్ అయి వుంది. నేడు ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు. కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు కాప్షన్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ రిలీజ్ గా ప్రకటించారు.
 
 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  ఫస్ట్ సింగిల్ 'నాయల్ది' చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ టీం దూకుడుగా ప్రమోషన్లు చేస్తోంది.
 
రిలీజ్ కి రాబోయే వేసవి సెలవుల అడ్వాంటేజ్ కానున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్  అవతార్ లో కనిపిస్తున్నారు. తన ఇంటెన్స్ ప్రజెన్స్  సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.  
 
ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments