Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవదీప్... బయట ఏం జరిగిందో లోపల ఎవ్వరికీ చెప్పకూడదు... 'బిగ్ బాస్' జూ.ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు షో క్రమంగా పుంజుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా స్టార్ మాలో నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు నుంచి కల్పన ఎలిమినేట్ అయ్యారు. తను ఎలిమినేట్

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (22:47 IST)
బిగ్ బాస్ తెలుగు షో క్రమంగా పుంజుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా స్టార్ మాలో నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు నుంచి కల్పన ఎలిమినేట్ అయ్యారు. తను ఎలిమినేట్ అవడానికి కారణాలను, బిగ్ బాస్ హౌసులో తన అనుభవాలను వివరించింది కల్పన. 
 
ఒకరు ఎలిమినేట్ అయితే మరొకరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ కావాలి కదా. ఇందులో భాగంగా హీరో నవదీప్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌసులోకి బుల్లెట్ వేసుకుని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నవదీప్‌ను పరిచయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్... చిన్నా నవదీప్... బయట ఏం జరిగిందో బిగ్ బాస్ హౌసులో వున్నవారికి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి బయట ఏం జరిగిందో నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. బయట ఏం జరిగిందో మనకు తెలిసిందే. డ్రగ్స్ కేసులో నవదీప్‌ను సిట్ అధికారులు విచారించారు. ఈ సంగతి చెప్పకూడదన్నమాట. మరి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇస్తున్న నువ్వు ఎలా వైల్డుగా ముందుకు వెళతావో చూస్తాం... అన్నారు జూ.ఎన్టీఆర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments